బిహార్(Bihar)లో దారుణం జరిగింది. విద్యార్థి (Student) సిగరెట్ తాగాడని నేపంతో ఓ ఉపాధ్యాయుడు (teacher) పిడిగుద్దులు కురిపించారు. ఈ ఘటనలో 15 ఏళ్ల ఆ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. తూర్పు చంపారన్ జిల్లా (Champaran District) మధుబన్ ప్రాంతానికి చెందిన బజరంగీ కుమార్.. తన తల్లి ఫోన్‌ను రిపేర్ షాప్ (Repair shop)నుంచి తీసుకురావడానికి బయటకు వెళ్లాడు. దారిలో హర్దియా వంతెన కిందకు వెళ్లి స్నేహితుడితో కలసి సిగరెట్ (Cigarette) వెలిగించాడు.అదే సమయంలో బజరంగీ కుమార్ చదువుతున్న పాఠశాల ఛైర్మన్ అక్కడకి వచ్చారు. వెంటనే బాలుడి తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పారు. తర్వాత ఛైర్మన్, అక్కడ ఉపాధ్యాయుడి (teacher) గా పనిచేస్తున్న బాలుడి బంధువు.. ఇద్దరూ బాలుడిని స్కూల్‌కి లాక్కెళ్లారు.అక్కడ పలువురు ఉపాధ్యాయులు బజరంగీ(Bajrangi)పై పిడిగుద్దులు కురిపించారు.
బెల్టులతో చావబాదారు. కాసేపటికి బాలుడు స్పృహ కోల్పోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.కాగా.. అక్కడ చికిత్స పొందుతూ బజరంగీ మృతి చెందాడు. కొడుకు మరణ వార్త విని బాలుడి తల్లి గుండెలవిసేలా రోదించారు. తమ కుమారుడి శరీరంపై తీవ్రగాయాలున్నాయని, ప్రైవేటు భాగాల్లోంచి రక్తం కారుతోందని ఆరోపించింది. కాగా ఐదు రోజుల క్రితమే కూలీ పనుల కోసం బాలుడి తండ్రి పంజాబ్(Punjab)కు వెళ్లడం గమనార్హం. అయితే తాము కొట్టామన్న ఆరోపణలను పాఠశాల ఛైర్మన్ (school Chairman) ఖండించారు. తన తల్లిదండ్రులకు సిగరెట్ విషయం చెబుతామనే భయంతో విషం తాగాడని తెలిపారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదన్నారు.