Renuka Chaudhary: ఈటల కాంగ్రెస్‌లో చేరతారా? ఓహ్ గుడ్, రాజగోపాల్ హార్ట్ ఇక్కడే
కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి హాట్ కామెంట్స్ చేశారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆమెను కలిసిన తర్వాత మీడియా ముందుకు వచ్చారు. ఈటల రాజేందర్ తమ పార్టీలో చేరతారా..? ఓహ్ గుడ్, రాజగోపాల్ రెడ్డి హార్ట్ ఇక్కడే ఉంటుందని అన్నారు.
Renuka Chaudhary: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు వేగంగా జరుగుతున్నాయి. ఢిల్లీ వెళ్లిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అండ్ టీమ్ ఈ రోజు ఖమ్మం జిల్లాకు చెందిన రేణుకా చౌదరిని (Renuka Chaudhary) కలిశారు. పొంగులేటి పార్టీలో చేరిక అనేది హై కమాండ్ నిర్ణయం అని.. దానిని తాను తప్పుకుండా పాటిస్తానని తెలిపారు. అంతకుముందు కూడా తాను వ్యతిరేకించలేదని.. కామెంట్ చేయాలని అడిగితే మాట్లాడలేదన్నారు. ఇతర పార్టీలో ఉన్న నేతల గురించి ఏం మాట్లాడుతామని మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. ఇప్పుడు స్పష్టత వచ్చినందున కామెంట్స్ చేస్తున్నానని తెలిపారు.
పోడు భూముల్లేవు.. పుచ్చకాయ భూములు లేవు
పార్టీలోకి వచ్చేందుకు పొంగులేటి ఎలాంటి డిమాండ్లు పెట్టలేదని రేణుకా (Renuka) వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడిందని.. క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో మాట్లాడి ఈ విషయం చెబుతున్నానని వివరించారు. కాంగ్రెస్ గ్రాఫ్ పెంటాస్టిక్గా ఉందని.. మార్పు కనిపిస్తోందని చెప్పారు. మోసాన్ని, దుర్మార్గాన్ని నమ్మే పరిస్థితి ఉండదన్నారు. బీఆర్ఎస్ అంటేనే కరప్షన్ అని ధ్వజమెత్తారు. పువ్వాడ అజయ్ ఓ దుర్మార్గ మంత్రి అని.. కేసీఆర్ వచ్చి ఏం చేశారని నిలదీశారు. పోడు భూములు లేవు పుచ్చకాయ భూములు లేవన్నారు. కాంగ్రెస్ వేసిన పునాదుల మీద జెండా ఎత్తారని మండిపడ్డారు.
బీజేపీలోనే కోవర్టులు
బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని రేణుకా చౌదరి (Renuka Chaudhary) అన్నారు. తమ పార్టీలో కాదు బీజేపీలో కోవర్టులు ఉన్నారని వివరించారు. బీజేపీకి తెలంగాణలో కాదు.. సౌత్‌లో సీన్ లేదని చెప్పారు. యూపీ సీఎం హైదరాబాద్ వచ్చి పేరు మారుస్తా అని చెబితే విశ్వసించే పరిస్థితి ఉండదన్నారు. సౌత్ రాజకీయాల గురించి మోడీ, నడ్డా, అమిత్ షాకు బోధపడటం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా పార్లమెంట్‌కు పోటీ చేస్తానని.. తాను ఎన్నడూ అసెంబ్లీకి పోటీ చేయలేదని వివరించారు. తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో అన్నీ పదవులు అనుభవించామని వివరించారు. ఖమ్మం జిల్లా ఆడబిడ్డగా, ఎంపీగా పనిచేస్తానని తెలిపారు. కేంద్రమంత్రి పదవీ చేపట్టానని వివరించారు. హైదరాబాద్‌లో ప్రియాంక గాంధీ ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటానని అంటే.. మేం టెంట్లు వేసుకొని ఉండే పరిస్థితి అని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్‌లో కుమ్ములాటలు లేవని.. బీజేపీ, బీఆర్ఎస్లోనే ఉంటవని తెలిపారు.
ఈటల వస్తానంటే నేనొద్దంటానా..?
తమ పార్టీలో చేరికలు బానే ఉంటాయని రేణుకా (Renuka) అంటున్నారు. ఈటల రాజేందర్.. వస్తే బాగానే ఉంటుందని తెలిపారు. రాజగోపాల్ రెడ్డి అని రిపోర్టర్లు అంటే ఇంటి వ్యవహారమేనని వివరించారు. ఆయన హార్ట్ మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుందని చెప్పారు.