NLR: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ పథకాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ సూచించారు. శుక్రవారం కార్పొరేషన్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎల్ఆర్ఎస్ పథకంలో అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ఉంటే వాటిని క్రమబద్ధీకరించుకోవచ్చని తెలిపారు.