నిన్న రష్మిక.. నేడు కాజోల్.. డీప్ ఫేక్ వీడియోలు బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ డీప్ ఫేక్ వీడియో బారిన పడ్డారు. ఓ ఇన్ ఫ్లూయెన్సర్ బట్టలు మార్చుకునే వీడియోకు ఏఐ సాయంతో కాజోల్ మొహం పెట్టారు. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Deepfake video: సెలబ్రిటీలను డీప్ ఫేక్ వీడియోలు (Deepfake video) వదలడం లేదు. ముందుగా రష్మిక మందన్నా దాని బారిన పడగా.. ఇప్పుడు సీనియర్ నటి కాజోల్ వంతు వచ్చింది. ఓ ఇన్ ఫ్లూయెన్సర్ బట్టలు మార్చే వీడియోకు నటి కాజోల్ మొహం మార్చారు. ఆ వీడియోను షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఏఐ టెక్నాలజీ ఆధారంగా కాజోల్ ఫేస్ పెట్టినట్టు తెలుస్తోంది. అలా పెట్టిన వారిపై కాజోల్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
కాజోల్ (Kajol) డీప్ ఫేక్ వీడియో ఫేస్ బుక్, ఎక్స్, యూట్యూబ్‌లలో తెగ చక్కర్లు కొడుతోంది. ఓరిజినల్ వీడియోను జూన్ 5వ తేదీన టిక్ టాక్‌లో షేర్ చేసినట్టు గుర్తించారు. కాజోల్ డీప్ ఫేక్ వీడియో ఎవరూ చేశారో తెలియదని బూమ్ నివేదిక చెబుతోంది. మార్చిన వీడియోలో కాసేపు అసలు మహిళ మొహం కనిపిస్తోందని పేర్కొంది.
ఫోటోలు, వీడియోలు, ఆడియోలతో డీప్ ఫేక్ వీడియోలు చేస్తున్నారని.. తర్వాత ఇది పోర్న్ వీడియో సృష్టించేందుకు కూడా దోహదం చేస్తుంది. ఇది సమాజానికి పెను సవాల్‌గా మారింది. రష్మిక మందన్నా ఇష్యూ తర్వాత తప్పుడు కంటెంట్ షేర్ చేయొద్దని.. ఒకవేళ షేర్ చేస్తే వెంటనే తొలగించాలని స్పష్టంచేసింది. వీడియోకు సంబంధించి ఫిర్యాదు వచ్చిన 36 గంటల్లో కంటెంట్ తీసివేయాలని స్పష్టంచేసింది. ఏఐ, డీప్ ఫేక్ ఉన్న ప్రస్తుత సమయంలో ఆ రూల్స్‌ను పెద్దగా పాటించడం లేదు. అందుకే రష్మిక (Rashmika) కేసు విచారణ జరుగుతుండగా.. కాజోల్ (Kajol) డీప్ ఫేక్ వీడియో బయటకు వచ్చింది.