యానిమల్ మూవీ హీరోయిన్ రష్మిక మందన్న ఇటివల సోషల్ మీడియాలో రికవరీ చాలా ముధ్యమని ఓ ట్వీట్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్ రష్మికకు ఏమైందోనని కంగారు పడుతున్నారు. అనేక మంది ట్వీట్లు చేస్తుండటంతో ఈ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(rashmika mandanna) ఇటివల సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తల్లో నిలిచారు. మొన్నటి వరకు తన చిత్రాలను డీప్ ఫేక్ పేరుతో పలువురు నెట్టింట పోస్ట్ చేయడంతో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అనేక మంది స్పందించారు కూడా. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ట్విట్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రికవరీ చాలా ముఖ్యమని గ్రీన్ కలర్ టీషర్ట్ ధరించి బెడ్ పై పడుకుని ఉన్న రెండు చిత్రాలను ఈ భామ ట్వీట్ చేసింది. ఇది చూసిన అభిమానులు రష్మికకు ఏమైందని ప్రశ్నిస్తున్నారు. అలా ఎందుకు రాసుకొచ్చిందని అంటున్నారు.
అయితే ఆమెకు జ్వరం వచ్చిందని పలువురు కామెంట్ చేస్తుండగా..ఇంకొంత మంది మాత్రం షూటింగ్(shooting) నుంచి కొంత గ్యాప్ తీసుకుందని అంటున్నారు. ఈ నటి మళ్లీ చురుకుగా వ్యాయామం చేయడానికి తనను తాను ఫిట్‌గా ఉంచుకోవడానికి రికవరీ అవ్వాలని కోరుకుంటున్నట్లు మరికొందరు చెబుతున్నారు. రష్మిక ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటుందని అంటున్నారు. ఇక రష్మిక అనారోగ్యం బారిన పడిందో లేదో తెలియదు కానీ..అభిమానులు మాత్రం తన హెల్త్ గురించి కంగారు పడుతున్నారు.
ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన రాబోయే చిత్రం యానిమల్(animal)లో రణబీర్ కపూర్ సరసన యాక్ట్ చేసింది. ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ మరికొందరు ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ, చిత్ర నిర్మాతలు దాని ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే సినిమా ట్రైలర్‌తో పాటు హువా మైన్, సత్రంగా, పాపా మేరీ జాన్ అనే మూడు పాటలను విడుదల చేశారు. డిసెంబర్ 1న ఈ చిత్రం థియేటర్లలో హిందీ, తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
అంతే కాకుండా సుకుమార్ డైరెక్ట్ చేసిన పుష్ప(pushpa) సినిమాకు సీక్వెల్లో కూడా రష్మిక శ్రీవల్లి పాత్రలో మళ్లీ యాక్ట్ చేస్తుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రకాష్ రాజ్, సునీల్, జగపతి బాబు, అనసూయ భరద్వాజ్ సహా పలువురు ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది. మరోవైపు ఈ నటి త్వరలో VD12 పేరుతో రాబోయే చిత్రం కోసం విజయ్ దేవరకొండతో మళ్లీ జతకట్టనున్నట్లు తెలుస్తోంది. కానీ దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు.