»Kamal Haasan Opens Up About His Role In Kalki 2898 Ad
Kalki 2898 AD : కల్కి ఒప్పుకోవడానికి కమలహాసన్ ఏడాది ఆలోచించార్ట! ఎందుకంటే?
ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ కల్కిలో కమలహాసన్ విలన్‌గా నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా గురించి, తన పాత్ర గురించి కమలహాసన్ ఏమంటున్నారంటే...?
Kalki 2898 AD : పాన్ ఇండియా మూవీ, భారీ బడ్జెట్ చిత్రం కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన పాత్ర గురించి కమలహాసన్(Kamal Haasan) కొన్ని విషయాలను మీడియాతో పంచుకున్నారు. ఈ సినిమాకి ఒప్పుకుని సైన్ చేయడానికి తాను ఏడాది ఆలోచించినట్లు తెలిపారు. గతంలో కొన్ని సినిమాలకు తాను విలన్‌గా నటించానని అన్నారు. అయితే ఇందులోని విలన్ పాత్ర విలక్షణమైనదని చెప్పారు. ఆ పాత్ర గురించి చెప్పగానే తన మీద తనకే అనుమానం వచ్చిందని చెప్పారు. ఇంతకు ముందు చేసిన విలన్ పాత్రలకంటే భిన్నంగా ఈ పాత్ర ఉండటంతో తాను ఏడాది సమయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో ఆయన సుప్రీం యాస్కిన్ పాత్రను పోషించారు.
పెద్ద పెద్ద స్టార్ నటులంతా ఈ సినిమా కోసం పని చేసిన విషయం తెలిసిందే. హీరోగా ప్రభాస్(prabhas), హీరోయిన్గా దీపిక పదుకొనే, విలన్‌గా కమల్‌హాసన్ నటించారు. అశ్వద్ధామ పాత్రను బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ పోషించారు. డైరెక్టర్‌గా నాగ్ అశ్విన్ పని చేశారు. అశ్వినీ దత్ భారీ బడ్జెట్‌తో ఈ పాన్ ఇండియా మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో అమితాబ్ సైతం వరుసగా స్పందిస్తూ వస్తున్నారు.
బిగ్‌బీ అమితాబ్ బచ్చన్(amitabh bachan) వరుసగా తన సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా ఈ సినిమా గురించి స్పందిస్తూ వస్తున్నారు. తాను దీని విడుదలకు ముందు రామ చరిత మానస్ పుస్తకాన్ని చదువుతున్నట్లు వెల్లడించారు. అందుకు తానెంతో ఆనందంగా ఉన్నట్లు తెలిపారు. ఎన్ని యుగాలు గడిచినా కొన్ని శాశ్వతంగా మన కళ్ల ముందు ఉంటాయని చెప్పుకొచ్చారు. అలాగే ఇటీవల జరిగిన ఓ ఇంటర్య్వలో డైరెక్టర్ నాగ్ అశ్విన్‌పై సైతం ఆయన ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో విజువల్స్ అద్భుతంగా వచ్చాయని అన్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టులో పని చేయడం తనకి మంచి అనుభవం అన్నారు. ఎప్పటికీ మరిచిపోలేనిదని వివరించారు.