»Ssmb 29 Tollywood Star Hero In Mahesh Rajamouli Movie
SSMB 29: ‘మహేష్-రాజమౌళి’ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో?
మహేష్ బాబు, రాజమౌళి ప్రాజెక్ట్ గురించి రోజుకో రూమర్ వినిపిస్తోంది. తాజాగా మరో టాలీవుడ్ స్టార్ హీరో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించబోతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత? రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నాడు.
SSMB 29 Tollywood star hero in 'Mahesh-Rajamouli' movie?
SSMB 29: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ ఎప్పుడో రావాల్సింది. కానీ గత పదేళ్లుగా ఈ క్రేజీ కాంబో వెనక్కి వెళ్తునే ఉంది. ఫైనల్‌గా ఆర్ఆర్ఆర్ తర్వాత హాలీవుడ్ రేంజ్లో మహేష్, రాజమౌళి కాంబో సెట్ అయింది. ఈ ఏడాదిలోనే ఎస్ఎస్ఎంబీ 29 సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ఈ సినిమా పని మీదే మహేష్ బాబు జర్మనీలో ఉన్నాడు. త్వరలోనే ఇండియాకి తిరిగి రానున్నాడు. మరోవైపు విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిందని చెప్పేశారు. రాజమౌళి కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. నటీనటుల ఎంపిక చేస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌లో పలువురు స్టార్స్ నటిస్తారని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో ఈ భారీ ప్రాజెక్ట్‌లో మరో తెలుగు స్టార్ హీరో నటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. సీనియర్ హీరో కింగ్ నాగార్జునని ఓ కీలక పాత్ర కోసం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట రాజమౌళి. గతంలో విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించిన ‘రాజన్న’ సినిమాకు కలిసి పని చేశారు రాజమౌళి, నాగార్జున. దీంతో ఈ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. అలా అని నాగ్‌కు ఆఫర్ ఇస్తున్నాడంటే నమ్మడం కష్టమే. క్యారెక్టర్ డిమాండ్ చేస్తేనే ఎవ్వరినైనా తన సినిమాలోకి తీసుకుంటాడు రాజమౌళి. కాబట్టి.. ఎస్ఎస్ఎంబీ 29లో నాగార్జునకు సరిపడ పాత్ర ఉంటే ఖచ్చితంగా తీసుకునే ఛాన్స్ ఉంది. అయితే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే రాజమౌళి చెప్పేవరకు వెయిట్ చేయాల్సిందే.