»Surekha Vanis Daughter Supritha Romances Bigg Boss Amar Deep
Bigg Boss Amar : బిగ్ బాస్ అమర్ దీప్తో సురేఖ వాణి కూతురు రొమాన్స్!
సీనియర్ యాక్టర్ సురేఖ వాణి కూతురు గురించి సోషల్ మీడియాలో ఫాలో వారందరికీ తెలుసు. హాట్ కంటెంట్ ఇవ్వడంలో ఎప్పుడు ముందుండే సుప్రిత ఇప్పుడు మరో స్టెప్ వేసింది. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది.
Surekha Vani's daughter Supritha romances Bigg Boss Amar Deep
Bigg Boss Amar :బిగ్ బాస్ ఏడో సీజన్ విన్నర్‌గా పల్లవి ప్రశాంత్ నిలవగా.. రన్నర్‌గా అమర్ దీప్ నిలిచాడు. అయితే బిగ్ బాస్‌తో మంచి ఫేమ్ సొంతం చేసుకున్న అమర్ దీప్.. తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటిని సంపాదించుకున్నాడు. అంతకుముందు సీరియల్ నటుడుగా అలరించాడు. ఓ సినిమా కూడా చేశాడు. ఇక ఇప్పుడు మరోసారి హీరోగా ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. తాజాగా ఒక కొత్త సినిమాను ప్రకటించాడు అమర్ దీప్. ఇప్పటివరకు కేవలం బుల్లితెరపై సందడి చేసిన అమర్ దీప్ మొదటిసారి వెండితెరపై హీరోగా సందడి చేయబోతున్నాడు. గురువారం నాడు ఈ సినిమా ప్రారంభం అయింది. ఇక ఈ చిత్రంతో సురేఖ వాణి కూతురు సుప్రిత హీరోయిన్గా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తోంది.
సురేఖ వాణి కూతురుగా సోషల్ మీడియాలో చాలా పాపులారిటీని సంపాదించుకుంది సుప్రిత. సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్ షేర్ చేస్తుంటుంది. తల్లి కూతురు ఇద్దరు కూడా హాట్ హాట్‌గా ఇన్‌స్టాలో రీల్స్ చేస్తూ సందడి చేస్తూ హాట్ టాపిక్ అవుతుంటారు. ఇక ఇప్పుడు హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతోంది. దీంతో సరదా సరదాకే సోషల్ మీడియాలోనే ఓ రేంజ్లో అందాలు ఆరబోసిన సుప్రిత.. ఇక సినిమాల్లో ఇంకెలా రచ్చ చేస్తుందో అని అంటున్నారు. అలాగే.. ఇప్పటికే మాస్ మహారాజా రవితేజ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసిన అమర్ దీప్ హీరోగా ఎలా మెప్పిస్తాడనేది చూడాలి. M3 మీడియా బ్యానర్లో మహేంద్ర నాథ్ కొండ్ల నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది.