»A Father Tied A Flexi To His Daughter For Marrying Him Against His Will The Video Went Viral
Viral News: ఇష్టం లేని పెళ్లి చేసుకుందని.. కూతురికి శ్రద్దాంజలి ఫ్లెక్సీ కట్టిన తండ్రి.. వీడియో వైరల్
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తన మాట కాదని ప్రేమించిన వ్యక్తిని పెళ్ళి చేసుకుందని ఓ తండ్రి తన ఆవేదన వ్యక్తం చేశాడు. తాను చనిపోయిందంటూ ఫ్లెక్సీ కట్టి తన బాధను సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
A father tied a flexi to his daughter for marrying him against his will. The video went viral
Viral News: ఏ తండ్రి అయినా తన కూతురిని ప్రేమగా పెంచుకొని, పెళ్లీడు వచ్చాక ఓ ఇంటికి ఇచ్చి తన బరువు దించుకుందాం అనుకుంటాడు. ఈ రోజుల్లో అలా కలలు కనడం, వాటిని నెరవేర్చుకోవడం తల్లిదండ్రుల వల్ల అవట్లేదు. ఫలితంగా గుండెల్లో పెట్టి పెంచుకున్న కూతుర్లు తమకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటున్నారు. పెద్దలు అంగీకరిస్తే ఓకే లేదంటే ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నారు. నేటి తరం ట్రెండ్‌గా మారింది. అలాంటి సమయంలో తల్లిదండ్రులకు తీరని దు:ఖం మాత్రమే మిగులుతుంది. ఇలాంటి ఘటనే తాజాగా సిరిసిల్లాలో చోటు చేసుకుంది. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని తన కూతురు చనిపోయిందంటూ ఫ్లెక్సీ కట్టి ఓ తండ్రి తన ఆవేదనకు వ్యక్త పరిచాడు. అదే విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టి మిగితా పేరెంట్స్ అప్రమత్తంగా ఉండాలంటూ చెప్పాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిలువేరి అనూష్ణ అనే యువతి బీటెక్ చదువుతుంది. చదువుతున్న ఆ అమ్మాయి ఓ వ్యక్తిని ప్రేమించింది. విషయం ఇంట్లో తెలియడంతో గొడవ జరిగింది. ఆ యువకుడిని మరిచిపోవాలని తండ్రి బుజ్జగించినా, బెదిరించినా వినిపించుకోలేదు. ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. దీంతో కోపం, బాధతో ఆ తండ్రి తన కూతురు చనిపోయనట్లు ఫ్లెక్సీ కట్టించాడు. మాయ మాటలు చెప్పి తన కూతుర్ని మోసం చేశాడు అంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికి రావద్దని కొందరు కామెంట్స్ చేస్తుంటే, ఎంత కోపం ఉన్న ఇలా చేయడం కరెక్ట్ కాదని హీతబోధ చేస్తున్నారు.