MNCL: ఆధునిక వ్యవసాయ పరికరాల వినియోగంపై రైతులు ఆసక్తిని పెంచుకోవాలని జన్నారం మండలంలోని కవ్వాల్ క్లస్టర్ ఏఈఓ అక్రమ్ సూచించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. మండలంలోని వివిధ గ్రామాలలో రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై ఆధునిక వ్యవసాయ పరికరాలను అందజేస్తుందన్నారు. ఆ పరికరాలను వినియోగించడం ద్వారా పంటలలో ఉత్పత్తి పెరగడంతో పాటు సమయం కూడా ఆదావుతుందన్నారు.