Khushboo: హీరోయిన్లు కూతుర్లు చాలా అరుదుగా హీరోయిన్లు అవుతుంటారు. ఇది రంగుల ప్రపంచం తెరమీద చూస్తున్నంత అందంగా ఉండవు తెరవెనుక వారి జీవితాలు. ఇలాంటి పరిశ్రమలో ఫీమేల్స్కు కొన్ని ఇబ్బందులు ఉంటాయి అనే వార్తలు కూడా చాలానే ఉన్నాయి. ఇవన్ని తెలిసిన హీరోయిన్లు తమ కూతుళ్ళకు ఎందుకు ఈ కష్టం అనుకుంటారు. కానీ కొంత మంది మాత్రం ఇండస్ట్రికి తమ డాటర్స్‌ను తీసుకొస్తారు. తాజాగా సీనియర్ హీరోయిన్, నటీ, పోలిటికల్ నేత ఖుష్బూ తన కూతురి విషయంలో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. త్వరలోనే పరిశ్రమకు తన డాటర్ పరిచయం కాబోతుంది అని పేర్కొంది. దాంతో ఈ వార్త కోలివుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
ప్రస్తుతం సొంత బ్యానర్లో నిర్మిస్తున్న బాకు చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లో పాల్గొన్న ఖుష్భు తన కూతురు అవంతిక గురించి చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే అవంతిక లండన్ ఫిల్మ్ కోర్సు పూర్తి చేసింది. తన గురించి ప్రస్తావిస్తూ.. లండన్‌లో అవంతిక యాక్టింగ్ కోర్స్ పూర్తిచేసుకుని ఇటీవలే ఇండియాకు వచ్చింది. ప్రస్తుతం డాన్స్ నేర్చుకుంటోందని చెప్పుకొచ్చింది. ఇక త్వరోనే హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం అయిందని తెలిపారు. అయితే తన కాళ్ల మీద తాను ఎదగాలని, పరిశ్రమలో ఆటుపోట్లు తెలుసుకోవాలని.. అందుకే సొంత బ్యానర్లో కాకుండా ఇతర బ్యానర్లో యాక్ట్ చేస్తుందని వెల్లడించారు. దీంతో ఖుష్భు కూతుర్ని అతి త్వరలోనే సిల్వర్ స్క్రీన్‌పై చూడబోతన్నామని సీనియర్ నటీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అన్ని కుదిరితే ఇంకో రెండు, మూడు నెలల్లో అవంతిక సినిమా కబురు చెప్పే అవకాశం ఉందని ఖుష్భు తెలిపారు.