మోస్ట్ అవైటేడ్ మూవీ పుష్ప2 పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. లేటెస్ట్గా రిలీజ్ అయిన పుష్ప.. పుష్ప.. సాంగ్ యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. దీంతో బన్నీ కెరీర్లోనే రికార్డ్ బిజినెస్ జరిగినట్టుగా సమాచారం.
Pushpa2: ప్రస్తుతం సోషల్ మీడియాలో పుష్పరాజ్ హవా నడుస్తోంది. లేటెస్ట్గా రిలీజ్ అయిన పుష్ప2 ఫస్ట్ సింగిల్‌ను రిపీట్ మోడ్‌లో వింటూ.. మరింత హైప్ ఎక్కించుకుంటున్నారు బన్నీ అభిమానులు. ఈ పాటలో చంద్రబోస్ రాసిన లిరిక్స్ అదిరిపోయాయని అంటున్నారు. ఈ సాంగ్ ఇస్తున్న హై మామూలుగా లేదని ట్రెండ్ చేస్తున్నారు. ఈ పాట రిలీజ్ అయినప్పటి నుంచి.. 24 గంటలుగా వరల్డ్ వైడ్ మోస్ట్ వ్యూడ్ సాంగ్‌గా నిలిచి రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో.. ఆగష్టు 15న రానున్న పుష్ప2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఇకపోతే.. ఈ సినిమా బిజినెస్ విషయంలో.. ఒక్కో చోట ఒక్కో రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే నార్త్‌లో ఏకంగా 200 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసి ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది.
తెలుగులోను భారీ బిజినెస్ జరిగేలా ఉంది. డిజిటిల్ రైట్స్ పరంగా 275 కోట్లు వచ్చాయని చెబుతున్నారు. ఇక ఇప్పుడు ఓవర్సీస్ బిజినెస్‌తో బన్నీ కెరీర్ బెస్ట్ బిజినెస్ చేసినట్టుగా సమాచారం. గత కొద్ది రోజులుగా పుష్ప 2 సినిమా ఓవర్సీస్ బిజినెస్‌పై చర్చలు జరుగుతున్నాయి. రకరకాల డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఈ సినిమా అమెరికా రైట్స్ కోసం పోటీ పడ్డాయి. ఫైనల్‌గా.. ఫస్ట్ సింగిల్ తర్వాత ఈ సినిమా ఓవర్సీస్ బిజినెస్ డీల్ ఓకే అయినట్టుగా తెలుస్తోంది. ప్రత్యాంగిరా సినిమాస్ వారు పుష్ప2 థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నట్టు తెలిసింది. ఈ సినిమా కోసం 7.5 మిలియన్ డాలర్లు.. అంటే, సుమారుగా 60 కోట్ల చెల్లించినట్టుగా సమాచారం. ఈ టార్గెట్ పుష్ప2 క్రేజ్ ముందు చిన్నదే అయినా.. ఓవర్సీస్ పరంగా బన్నీకెరీర్లోనే ఇది రికార్డు బిజినెస్ అని అంటున్నారు.