»A Chance To Act With Ram Charan Be Ready On These Dates
Ram Charan: రామ్ చరణ్‌తో నటించే ఛాన్స్.. ఈ డేట్స్‌లో రెడీగా ఉండండి!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో నటించే ఛాన్స్ కావాలా? అయితే అలాంటి వారి కోసమే ఈ బంపర్ ఆఫర్. చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆర్సీ 16 కోసం క్యాస్టింగ్ కాల్ ఇచ్చాడు డైరెక్టర్ బుచ్చిబాబు. ఏకంగా 400 మంది కావాలంటున్నాడు.
A chance to act with Ram Charan.. Be ready on these dates!
Ram Charan: ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ రోజు రోజుకి డిలే అవుతునే ఉంది. ఇప్పటి వరకు 80 శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్టుగా రీసెంట్‌గానే క్లారిటీ ఇచ్చాడు దిల్ రాజు. ఎట్టి పరిస్థితుల్లోను ఈ సినిమాను మార్చి వరకు కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత మార్చి నుంచి బుచ్చిబాబు సినిమాను మొదలుపెట్టాలని చూస్తున్నాడు చరణ్. ఇప్పటికే బుచ్చిబాబు స్క్రిప్టు రెడీ చేసుకొని.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. మెయిన్ కాస్టింగ్ కూడా దాదాపుగా ఫైనల్ అయిపోయిందని అంటున్నారు. అయితే ఇటీవలె మిగతా క్యాస్టింగ్ కోసం కాస్టింగ్ కాల్ ప్రకటించారు. ఉత్తరాంధ్రా యాసలో తెలుగు మాట్లాడగలిగి యాక్టింగ్ వస్తే చాలు.. అన్ని వయసుల వారీగా తమ ప్రొఫైల్స్‌ను పంపించాల్సిందిగా కోరారు. అలాంటి వారు ఇప్పుడు రెడీగా ఉండాలని ఆడిషన్ డేట్స్ ఇచ్చారు.
ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 17వ తేదీ వరకు విజయనగరం, సాలూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఆడిషన్స్ పెడుతున్నామని.. నటించాలని ఆసక్తి ఉన్న వారందరూ రావాలని పేర్కొన్నారు. ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్లో తెరకెక్కబోతోంది కాబట్టి.. స్త్రీలు, పురుషులు, చిన్న పిల్లలు ఇలా అన్ని వయసుల వారు దాదాపు 400 మంది ఈ ఆడిషన్స్‌లో సెలెక్ట్ చేస్తారని అంటున్నారు. గేమ్ చేంజర్ షూటింగ్ అవడమే లేట్.. వెంటనే ఆర్సీ 16 షూటింగ్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాడు చరణ్. సమ్మర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. మరి చరణ్‌తో నటించే ఛాన్స్ ఎవరెవరు దక్కించుకుంటారో చూడాలి.