»Tripti Dimri We Need Someone With These Qualities
Tripti Dimri: ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అతనే కావాలి!
యానిమల్ సినిమాలో బోల్డ్ సీన్లో నటించిన త్రిప్తి డిమ్రి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఈ బ్యూటీ పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్లు చేసింది.
Tripti Dimri: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమా బాక్సాఫిస్ వద్ద కోట్లు కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాలో రణబీర్ కపూర్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించారు. అయితే ఇందులో ఉత్తరాఖండ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి కూడా నటించారు. సినిమాలో కనిపించింది తక్కువ సమయమే అయిన.. రష్మిక కంటే ఎక్కువ క్రేజ్‌ను సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత ఈమె ఫాలోవర్స్ సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈమెకు ఆఫర్లు కూడా క్యూ కట్టాయి. ఇదిలా ఉండగా ఇటీవల ఓ ఇంటర్వూలో పాల్గొన్న ఈమె తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు తెలిపింది.
పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ప్రశ్నించగా.. ప్రస్తుతం అలాంటి ఆలోచన లేదని తెలిపింది. కేవలం తన కెరీర్‌పైనే దృష్టి పెట్టినట్లు తెలిపింది. మరి కాబోయే భర్త ఎలా ఉండాలనుకుంటున్నారని అడగ్గా.. మంచి వ్యక్తి అయితే చాలని తెలిపింది. మంచిగా ఉంటే డబ్బు, పేరు వాటంతట అవే వస్తాయని తెలిపింది. కాబోయే భర్తకి అందం, ఆస్తి, పాపులారిటీ లేకపోయిన పర్వాలేదని బ్యూటీ తెలిపింది.