»Cm Revanth Reddy Cm Orders To Solve Traffic Problems
Cm Revanth Reddy: ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించాలని సీఎం ఆదేశాలు
హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పైవంతెనలు, అండర్ పాస్లు, సొరంగ మార్గాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు.
Cm Revanth Reddy: హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పైవంతెనలు, అండర్ పాస్లు, సొరంగ మార్గాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. ఎల్బీనగర్ కూడలి మాదిరిగా నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉన్న కూడళ్లను అభివృద్ధి చేయడంపై అధ్యయనం చేయాలి. రద్దీ నియంత్రణకు సమీపంలోని లా అండ్ ఆర్డర్ పోలీసుల సేవలు ఉపయోగించుకోవాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని ట్రాఫిక్ ఠాణాల స్థాయిని పెంచాల్సి ఉంది. అందుకోసం వెయ్యి మంది హోంగార్డులను నియమించుకోండని తెలిపారు. ఈ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలను ఎంపిక చేసి.. వీలైనన్ని బహుళ అంతస్తుల పార్కింగ్ కాంప్లెక్సులు నిర్మించడానికి ప్రయత్నించండని రేవంత్ రెడ్డి తెలిపారు.