కేంద్ర కేబినెట్ ఈరోజు సమావేశమైంది. భేటీలో కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు.
300 units of electricity free Nirmala Sitharaman Budget2024
Budget 2024: కేంద్ర కేబినెట్ ఈరోజు సమావేశమైంది. భేటీలో కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్. కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్‌కు ప్రవేశపెట్టబోయే ముందు నిర్మలా సీతారామన్ రాష్ట్రపతిని కలిశారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రికి స్వీటు తినిపించారు. స్వీట్ తిన్న తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు చేరుకొని కేబినెట్ సమావేశంలో పాల్గొన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టారు.