చాలామంది జీవితాల్లో ఒక చిన్న మార్పు వాళ్ల జీవితాన్ని మలుపు తిప్పుతుంది. మరి సచిన్ జీవితంలో మొదటి మ్యాచ్ నిరాశ కలిగించింది. మరి ఆ నిరాశ నేర్పిన అనుభవం ఏంటో తెలుసుకుందాం.
Sachin Tendulkar: చాలామంది జీవితాల్లో ఒక చిన్న మార్పు వాళ్ల జీవితాన్ని మలుపు తిప్పుతుంది. జీవితంలో సాధించిన సక్సెస్ కంటే ఫెయిల్యూర్ మనల్ని ఉన్నత స్థానంలో తీర్చుదిద్దుతుంది. ఆ నిమిషానికి ఫెయిల్యూర్స్ మనకి నిరాశ కల్పించిన తర్వాత ఒక అనుభవాన్ని ఇస్తుంది. ఇలాంటి కోవకు చెందిన వారిలో మనలో చాలామంది ఉంటారు. అందులో ఒకరు సచిన్ టెండుల్కర్. తన మొదటి మ్యాచ్‌లో డకౌట్ కావడం తనకు తీవ్ర నిరాశ కలిగించిందని సచిన్ తెలిపారు. కాలనీ జట్టులో ప్రధాన బ్యాటర్‌గా బరిలో దిగినా సున్నాకే ఔటైనట్లు సచిన్ తెలిపాడు. సచిన్ జీవితంలో మొట్టమొదటి మ్యాచ్ సాహిత్య సహవాస్ కాలనీలో జరిగింది. ఆ మ్యాచ్‌కు స్నేహితులందరినీ పిలిచా. కాలనీ తరపున ప్రధాన బ్యాటర్ కావడంతో మ్యాచ్ చూడాలని కోరాను.
మ్యాచ్ చూడటానికి స్నేహితులంతా వచ్చారు. కానీ మొదటి బంతికే డకౌటయ్యాను. చాలా నిరాశకు లోనయ్యా. గల్లీ క్రికెట్‌కు తగ్గట్లే కొన్ని సాకులు చెప్పా. బంతి తక్కువ ఎత్తులో వచ్చిందని చెప్పడంతో అందరూ ఒప్పుకున్నారు. తర్వాతి మ్యాచ్‌కు కూడా అందరినీ పిలిచా. మళ్లీ తొలి బంతికే ఔటయ్యా. ఈసారి బంతి కాస్త ఎక్కువ ఎత్తులో వచ్చిందని చెప్పా. తప్పు నాది కాదు పిచ్దేనన్నా. మూడో మ్యాచ్‌కు ఎవరినీ పిలవలేదు. 5-6 బంతులాడి ఒక్క పరుగు చేసి రనౌటయ్యా. ఆ ఒక్క పరుగు చేసినందుకు ఎంతో సంతోషించా. ఒక్క పరుగు చేసినందుకు శివాజీ పార్కు నుంచి బాంద్రాకు బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు సంతృప్తిగా అనిపించింది. నా ఆలోచన విధానాన్ని మార్చింది ఆ ఒక్క పరుగే అని సచిన్ తెలిపారు.