»Wankhede Stadium In Mumbai Is My Second Home Sachins Interesting Tweet
Sachin Tendulkar: వాంఖడే నాకు రెండో ఇళ్లు సచిన్ ఆసక్తికరమైన ట్వీట్
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వాంఖడే స్టేడియం గురించి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అది ఆయనకు రెండవ ఇళ్లు అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
Wankhede Stadium in Mumbai is my second home Sachin's interesting tweet
Sachin Tendulkar: ముంబైలోని వాంఖడే స్టేడియాన్ని నిర్మించి నేటికి 50 ఏళ్లు పూర్తి అయింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆసక్తికర పోస్ట్ చేశాడు. “నేను పదేళ్ల వయస్సులో మొదటిసారి వాంఖడే స్టేడియాన్ని చూశాను. ఆ తరువాత ఐదేళ్ల గడిచాక ఇదే స్టేడియంలో ముంబై తరఫున అరంగేట్రం చేశాను. అంటే 15 ఏళ్లప్పుడు వాంఖడే స్టేడియంలో మొదటిసారి గుజరాత్‌పై క్రికెట్ ఆడా. ఆ తరువాత ఇదే స్టేడియంలో ఎన్నో మ్యాచ్‌లు ఆడాను. 2011లో నా దేశం కోసం వరల్డ్ కప్‌ను గెలవడం నా కెరీర్లో మరిచిపోలేని క్షణాలు. ఇక్కడే నా 200వ టెస్ట్ మ్యాచ్‌నూ ఆడా. ఇదే మైదానంలో నాకెంతో ఇష్టమైన ఆటకు వీడ్కోలు పలికాను.. అందుకే, వాంఖడే నాకు మరో ఇల్లు లాంటిది” అని సచిన్ రాసుకొచ్చారు.
క్రికెట్ దేవుడిగా కొలిచే సచిన్ కేరియర్ గురించి చాలా మందికి తెలుసు. క్రికెట్ తప్ప మరో ప్రపంచం తెలియని వ్యక్తి ఆయన. ఎంతో మందికి స్పూర్తి. తన 24ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో 200 టెస్ట్ మ్యాచ్‌లు, 463 వన్డేలు ఆడాడు. టెస్ట్‌లలో 15,921 పరుగులు, వన్డేలలో 18,426 పరుగులు చేశాడు. అలాగే ఈ రెండు ఫార్మాట్లలో కలిపి మొత్తం 100 సెంచరీలు, టెస్టుల్లో 51, వన్డేలలో 49 సెంచరీలు ఉన్నాయి.