KRNL: తెలుగు భాష, సాహిత్య పరిరక్షణకు చేసిన సేవలకు గుర్తింపుగా కర్నూలు నగరపాలక సంస్థ మేనేజర్ యన్. చిన్నరాముడుకు ఆంధ్ర సరస్వత పరిషత్ అవార్డు లభించింది. ఆంధ్ర సరస్వత పరిషత్ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలు-2026లో భాగంగా ఆయనను ఘనంగా సత్కరించారు.