కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్ రైతులకు, మధ్యతరగతి ప్రజలకు మేలు చేసేలా ఉంటుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
Budget2024: పార్లమెంట్(Parliament)లో గురువారం ప్రవేశ పెట్టిన బడ్జెట్(Budget2024)లో ప్రతీ ఇంటికి 300 యూనిట్ల సోలార్ విద్యుత్(Solar electricity) ఉచితంగా అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామన్(Nirmala Sitharaman) పేర్కొన్నారు. సూమారు దేశంలో కోటి ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ సెటప్స్ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, రైతు సంక్షేమం కోసం వివిధ పథకాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. మద్దతు ధర, పెట్టుబడి సాయంతో రైతులను ఆదుకున్నామని చెప్పారు. పీఎం కిసాన్ సమ్మన్ నిధి ద్వారా గత పదేళ్లలో 11.8 కోట్ల మంది రైతులకు ఆర్థిక సాయం అందినట్లు తెలిపారు. వ్యవసాయ రంగంలో సాంకేతికతను తీసుకొచ్చామన్నారు.
దేశ జీడిపిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో పాటుపడిందని, అయితే జీడిపీ అంటే గవర్నెన్స్, డెవలప్మెంట్, ఫర్మార్మెన్స్ అని నిర్మాల సీతారామన్ పేర్కొన్నారు. ఫసల్ బీమా యోజన కింద 4 కోట్ల మంది రైతులకు పంట బీమా అందిందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు ఉద్యోగ అవకాశాలు పెంపోందించేలా పథకాలు అమలు పరిచామని తెలిపారు. డెయిరీ ఉత్పత్తలు పెరిగాయని, ఆయిల్ సీడ్స్ రంగంలో రైతులు వృద్ధి సాధిస్తున్నారని, దానికి కేంద్రం ఇస్తున్న సబ్సిడీ చాలా ఉపయోగపడిందని వెల్లడించారు.