Dadasaheb Phalke Film Festival 2024: సినీరంగంలో ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుల కార్యక్రమం నిన్న ముంబైలో ఘనంగా జరిగింది. ఈ అవార్డుల వేడుకలో సినీతారలు సందడి చేశారు. అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ చిత్రం గతేడాది విడుదలయ్యింది. ఈ సినిమాలో హీరోగా నటించిన షారుక్ ఖాన్ ఉత్తమ నటుడిగా, హీరోయిన్గా నటించిన నయనతార ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. యానిమల్ చిత్రానికి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. ఈ చిత్రంలో నెగెటివ్ రోల్లో యాక్ట్ చేసిన బాబీ డియోల్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.
క్రిటిక్స్ ఉత్తమ నటుడు – విక్కీ కౌశల్ ( సామ్ బహదూర్)
ఉత్తమ గీత రచయిత – జావేద్ అక్తర్ ( నిక్లే ది కభి హమ్ ఘర్సే ధున్కీ)
ఉత్తమ సంగీత దర్శకుడు – అనిరుధ్ రవిచందర్
ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (మేల్) – వరుణ్ జైన్
ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (ఫిమేల్) – శిల్పా రావు
ఔట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఇన్ మ్యూజిక్ ఇండస్ట్రీ – యేసుదాసు
ఔట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ – మౌషుమీ ఛటర్జీ
టెలివిజన్ విభాగం
టెలివిజన్ సిరీస్ ఆఫ్‌ది ఇయర్ – ఘమ్ హై కిసీకే ప్యార్ మెయిన్
ఉత్తమ నటుడు – నెయిల్ భట్ (ఘమ్ హై కిసీకే ప్యార్ మెయిన్)
ఉత్తమ నటి – రూపాలీ గంగూలీ (అనుపమ)
వెబ్‌సిరీస్ విభాగం
క్రిటిక్స్ ఉత్తమ నటి – కరిష్మా తన్నా (స్కూప్)