Akaay: టీమ్ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులకు కుమారుడు పుట్టాడు. ఈ విషయాన్ని కోహ్లీ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అయితే ఆ కుమారుడికి అకాయ్ అని నామకరణం చేశారు. ఈ నెల 15వ తేదీన అనుష్క మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపాడు. 2017లో వివాహం చేసుకున్న ఈ జంటకు 2021లో ఓ అమ్మాయి పుట్టింది. ఈ పాపకు వామిక అని నామకరణం చేశారు. అయితే వామిక అంటే దుర్గాదేవి అని అర్థం. అయితే ఇప్పుడు కుమారుడుకి అకాయ్ అని నామకరణం చేశారు. ఈ పేరు చాలా ప్రత్యేకంగా ఉంది. మరి ఈ పేరుకి అర్థం ఏంటో అని కోహ్లీ ఫ్యాన్స్ నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు.
అకాయ్ అనే పేరు హిందీ పదం కాయ నుంచి వచ్చినట్లు కొందరు భావిస్తున్నారు. కాయ్ అంటే కాయం. అంటే శరీరం అని అర్థం. అకాయ్ అంటే పుష్టికరమైన శరీరం కలవాడనే అర్థం వస్తుందని కొందరు భావిస్తున్నారు. ఇక టర్కిష్ భాషలో అకాయ్ అనే అంటే మెరిసే చంద్రుడు అని అర్థం. అయితే మగబిడ్డకు అకాయ్ అని పేరు నామకరణం ఎందుకు చేశారో ఆ జంట అధికారికంగా ఇంకా వెల్లడించలేదు.
ఫిబ్రవరి 15న అనుష్క మగబిడ్డకు జన్మనిచ్చిందని కోహ్లీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఫిబ్రవరి 15న మా బాబు, వామిక తమ్ముడు అకాయ్ని ఈ ప్రపంచంలోకి ఆహ్వానించాం. ఈ విషయం అందరికీ చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఈ అందమైన సమయంలో మీ ఆశీర్వాదాలు కావాలి. మా ఏకాంతాన్ని గౌరవించమని విజ్ఞప్తి చేస్తున్నామని కోహ్లి పోస్ట్ చేశాడు.