తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ అనే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలసిందే. ఇందులో సూర్య రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. అయితే.. ఏకంగా పదివేల మందితో యుద్ధం అనే న్యూస్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
Kanguva: సిరుత్తై శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కంగువ సినిమా నుంచి.. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ సినిమా పై ఆసక్తిని పెంచుతూ వస్తున్నాయి. అలాగే.. స్పెషల్ గ్లింప్స్ అంచనాలను భారీగా పెంచేశాయి. వారియర్‌గా సూర్య లుక్ మాత్రం మామూలుగా లేదు. ఇక సూర్యకు విలన్‌గా అనిమల్ అబ్రార్ బాబీ డియోల్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ ఇద్దరి పై వచ్చిన గ్లింప్స్ అదిరిపోయింది. ఈ ఇద్దరిని బిగ్ స్క్రీన్ పై చూస్తే.. మెంటల్ మాస్ అనేలా ఉంది.
అయితే.. ఈ సినిమాలో భారీ యుద్ధానికి సంబంధించిన సీక్వెన్స్ ఒకటి తీసినట్లుగా తెలిసింది. ఈ వార్ సీన్‌ను ఏకంగా 10 వేల మందితో తెరకెక్కించినట్టుగా సమాచారం. ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. సినిమా సబ్జెక్ట్, థీమ్ ప్రకారం.. ఓ యుద్ధ సన్నివేశానికి న్యాయం చేయడానికి ది స్టూడియో గ్రీన్, డైరెక్టర్ శివ, మొత్తం టీమ్ ఎంతగానో శ్రమించదట. సూర్య, బాబీ డియోల్‌తో పాటు మరో పది వేల మందితో అతిపెద్ద వార్ సీక్వెన్స్ ఉండనుందని.. అని కంగువ వర్గాలు వెల్లడించినట్లుగా తెలిసింది.
కళ్లు చెదిరే సినిమాటిక్ ఎక్స్పీరియర్ష్ను ఆడియెన్స్‌కు అందించాలన్న ఉద్దేశంతో.. ఈ యుద్ధ సన్నివేశాన్ని చేసినట్లుగా చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. దీంతో.. కంగువ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఏకంగా ఈ సినిమాను.. పది భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మరి కంగువ ఎలా ఉంటుందో చూడాలి.