ఉన్నట్టుండి తన లైఫ్‌లోకి ఒక స్పెషల్ పర్సన్ వస్తున్నారని.. ప్రభాస్ పోస్ట్ చేయడంతో అంతా పెళ్లి గురించే అనుకున్నారు. కానీ ఇప్పుడు బుజ్జి రాబోతోందని ప్రకటించాడు. దీంతో ఆ బుజ్జి ఎవరనే చర్చ జరుగుతోంది.
Prabhas: హమ్మయ్య.. ఎట్టకేలకు ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు.. అని అంతా అనుకున్నారు. మా లైఫ్‌లోకి స్పెషల్ పర్సన్ వస్తున్నారని.. ప్రభాస్ చేసిన ఇన్‌స్టా పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇక పెళ్లి కబురు చెప్పడమే లేట్ అనుకున్నారు. కానీ ప్రభాస్ పెళ్లి న్యూస్ అంటే, ఆ లెక్క వేరే ఉంటది. అందుకే.. ఇదేదో కల్కి ప్రమోషన్స్ స్టంట్ అని అంతా అనుకున్నారు. అనుకున్నట్టే.. నా బుజ్జిని చూడడానికి రెడీగా ఉండండని క్లారిటీ ఇచ్చేశాడు ప్రభాస్. అయితే.. బుజ్జి అంటే హీరోయిన్ అనుకునేరు. ఈ బుజ్జి లెక్క వేరేలా ఉంది.
స్క్రాచ్ ఎపిసోడ్ 04 మే 18 సాయంత్రం 5 గంటలకు రిలీజ్ కానున్నట్లు వెల్లడించిన ప్రభాస్.. ‘డార్లింగ్స్.. నా బుజ్జిని మీరు చూడాలని ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను’ అని రాసుకొచ్చాడు. దీంతో ఆ బుజ్జి ఎవరన్న చర్చ మొదలైంది. కల్కి మూవీలో ప్రభాస్ ‘భైరవ’ పాత్రలో నటిస్తున్నాడు. భైరవ ఓ ప్రత్యేక వాహనం వాడుతాడని.. దాని పేరే బుజ్జి అని అంటున్నారు. దాన్నే ఇప్పుడు ప్రేక్షకులకులకు పరిచయం చేయనున్నట్టు తెలుస్తోంది. టైం ట్రావెల్ సినిమా కావడంతో.. సినిమాలో బుజ్జి కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు.
గతంలోనే చిత్ర యూనిట్ స్క్రాచ్ పేరుతో కొన్ని వీడియోలు రిలీజ్ చేయగా.. అందులో ఓ ప్రత్యేకమైన కారును కూడా తయారు చేయించారు. ఈ బుజ్జి కారులోనే ప్రమోషన్లు చేసేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అయితే.. ఇంతలా హైప్ ఇస్తున్నారంటే, ఖచ్చితంగా బుజ్జి మామూలుగా ఉండదనే చెప్పాలి. ప్రస్తుతానికైతే.. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా బుజ్జి కోసమే వెయిట్ చేస్తున్నారు. మరి బుజ్జి ఎలా ఉంటుందో చూడాలి.