»Rajinikanth At Director Shankars Daughter Aishwaryas Wedding
Rajinikanth: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లిలో రజనీకాంత్
డైరెక్టర్ శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య మూడు ముళ్ల బంధంలో అడుగుపెట్టింది. ఈ వేడుకలో సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Rajinikanth at director Shankar's daughter Aishwarya's wedding
Rajinikanth: తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ పెద్ద కూతురు వివాహం జరిగింది. ఆయన పెద్ద కూతురు ఐశర్వ అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తిక్‌తో ఈరోజు మూడు ముళ్ల బంధంలో అడుగుపెట్టింది. చైన్నైలోని ప్రముఖ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ వేడుకలో పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీ తారలు సందడి చేశారు. ముఖ్యంగా కమల్ హాసన్, రజనీకాంత్, సూర్య, నయనతార- విఘ్నేష్ శివన్ దంపతులు కొత్త జంటను ఆశీర్వాదించారు. రజనీకాంత్ సింపుల్‌గా ట్రెడిషనల్ లుంగి కట్టులో కన్పించారు. ఈ సందర్భంగా వధూవరులను ఆశీర్వాదించి డైరెక్టర్ శంకర్‌తో కాసేపు మాట్లాడి వెళ్లారు.
ఐశ్వర్యకు ఇది రెండో వివాహం. గతంలో క్రికెటర్ రోహిత్‌తో 2021లో వివాహం జరిగింది. కొన్నాళ్ల తరువాత అతడిపై వచ్చిన రూమర్స్‌తో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు. ఇక ప్రస్తుతం పెళ్లి చేసుకున్న తరుణ్ కార్తిక్ శంకర్ అసిస్టెంట్‌గా ఉన్నారు. పలు సినిమాలకు పనిచేశారు. ఇక శంకర్ ప్రస్తుతం ఇండియన్-2, గేమ్ ఛేంజర్ రెండు సినిమాలు చేస్తున్నారు. శంకర్ ఆక్టోబర్‌లో విడుదల అయ్యే అవకాశం ఉందని ఇటీవల రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అలాగే ఇండియన్-2 సైతం జూన్‌లో వచ్చే అవకాశం ఉంది.