Kanguva: తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం కంగువ (Kanguva). డైరెక్టర్ శివ(siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. డా.బీఆర్ అంబేద్కర్(Dr. BR Ambedkar) జయంతి, తమిళ నూతన సంవత్సరం సందర్భంగా ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో 2024లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తేదీ ప్రకటించలేదు. కంగువ చిత్రం రెండు కాలల కథను తెలపనుంది అనేది అర్థం అవుతుంది.
ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ౩డీ ఫార్మాట్లో సందడి చేయడానికి ముస్తాబు అవుతుంది. ఇప్పటికే విడుదల చేసిన కంగువ గ్లింప్స్ (Kanguva Glimpse)తో, పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీనిలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే సూర్య కెరీర్లో బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ అందించిన దేవీశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ ఇస్తున్నారు. సూర్య మరోవైపు సుధా కొంగర డైరెక్షన్లో తన 43వ చిత్రంలో నటిస్తున్నారు.