GDWL: గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో దశకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ రేపటి (బుధవారం) నుంచి ప్రారంభం కానుంది. ఈ దశలో మానవపాడు, అలంపూర్, ఎర్రవల్లి, ఇటిక్యాల, ఉండవెల్లి మండలాల పరిధిలోని 75 గ్రామాల్లో మొత్తం 700 వార్డులకు అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.