AP: తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో రేపు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అయ్యవరం గ్రామంలో ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా 8,451 రైతుసేవా కేంద్రాలలో కరపత్రాల పంపిణీ జరగనుంది. అనంతరం టీడీపీ కార్యకర్తలతో సీఎం భేటీ కానున్నారు.