Gold Rates Today : పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. రూ.75వేలు దాటిన బంగారం
రెండు నెలలుగా బంగారం ధరలు క్రమంగా పెరుగుతూనే వస్తున్నాయి. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో బంగారం, వెండి ధరలు భారీ పెరుగుదలను నమోదు చేసుకుంటున్నాయి. ఏ లోహం ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
Gold and Silver Rates Today : పసిడిని కొనుక్కోవాలని, పెట్టుబడి మార్గంగా మలుచుకోవాలని ఆలోచనల్లో ఉన్న వారు రోజువారీ పసిడి రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది చదివేయండి. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర ఒక్కరోజే ఏకంగా వెయ్యికి పైగా పెరిగింది. దీంతో ప్రస్తుతం దీని ధర రూ.75,172కు చేరుకుంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.75,172గా కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవని గుర్తుంచుకోవాలి. కొనుగోలుదారులు నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు జీఎస్టీ, మజూరీల్లాంటివి అదనంగా తోడవుతాయని గమనించుకోవాలి.
దేశీయ మార్కెట్లలో వెండి ధర(Silver Rate)లు సైతం భారీ పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. శుక్రవారం నాటికి కేజీ వెండి రూ.2,402 పెరిగి రూ.86,427కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరుల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. వెండి, బంగారం రెండూ కూడా నేటి మార్కెట్ ప్రారంభ సమయానికి స్వల్పంగా తగ్గుముఖం పట్టడం గమనార్హం.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, వెండి ధరలు సైతం పెరుగుతున్నాయి. స్పాట్ గోల్డ్ శుక్రవారం నాటికి 40 డాలర్లు పెరిగి 2,385 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 28.76 డాలర్లుగా ఉంది.