HYD: ఈ నెల 7న ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నా అని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మంగళవారం గాంధీభవన్లో ఆయన మాట్లాడారు. ‘ఎంతో మంది ఉద్దండులను అందించిన OUను కేసీఆర్ కాల గర్భంలో కలిపేశారు. యూనివర్సిటీని ప్రపంచ స్థాయిలో నిలబెట్టేందుకు ఎంతైనా ఖర్చు చేస్తా’ అని చెప్పారు. కాగా, ఇప్పటికే ఓయూని సందర్శించిన సీఎం భారీగా నిధులు కేటాయిస్తామన్నారు.