ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఓలా కన్జూమర్ దేశంలోనే తొలిసారిగా నాన్-ఏసీ కేటగిరీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కస్టమర్లకు మరిన్ని ఎంపికలను అందించేందుకు తమ కంపెనీ కట్టుబడి ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనమని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.