ప్రభాస్ హీరోగా వచ్చిన సైన్స్ ఫిక్షన్ సినిమా ‘కల్కి’. ఈ మూవీ సెకండ్ పార్ట్ నుంచి హీరోయిన్ దీపికా పదుకొణె తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆమె స్థానంలో ఎవరు నటించబోతున్నారనే చర్చ గత కొంత కాలంగా నడుస్తోంది. అయితే ఆమె స్థానంలో తాజాగా ప్రియాంక చోప్రాను తీసుకున్నట్లు సమాచారం. దీనిపై చిత్రబృందం అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.