బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఫర్నీషింగ్ బ్రాండ్ వేక్‌ఫిట్ ఇన్నోవేషన్ లిమిటెడ్ ఐపీఓ ఈనెల 8న ప్రారంభమై 10తో ముగియనుంది. ఐపీఓ ద్వారా రూ.1,289 కోట్లు కంపెనీ సమీకరించనుంది. ఇష్యూలో భాగంగా ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.185- 195గా కంపెనీ నిర్ణయించింది. రూ.6,400 కోట్ల మార్కెట్ విలువతో కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది.