KMR: భిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు బోండ్ల సునీల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశాడని కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భీమ్ రెడ్డి సోమవారం ఎస్సై ఆంజనేయులుకు వినతిపత్రం అందజేశారు. సునీల్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.