»What Is Rohit Sharmas Response To The Ball Tampering Allegations
Rohit Sharma: బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలపై రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
భారత బౌలర్లు బాల్ ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణలపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. బాల్ రివర్స్ స్వింగ్ వేసిన మాట వాస్తవమే అని, వాతావరణ పరిస్థితులను బట్టి బాల్ రివర్స్ స్వింగ్ అవుతుందని పేర్కొన్నారు.
Rohit Sharma: టీ20 వరల్డ్ కప్‌లో భారత్ అద్భుత ప్రదర్శన కనబరుస్తుంది. వన్టే వరల్డ్ కప్ సాధించిన ఆస్ట్రేలియాపై రివెంజ్ తీర్చుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చారు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ ఈ ఆరోపణలె చేశారు. వాటిపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) స్పందించారు. ట్యాంపరింగ్ ఆరోపణలను ఖండించారు.
ప్రస్తుతం అక్కడి పిచ్ పరిస్థితుల దృష్ట్యా రివర్స్ స్వింగ్ అవుతున్నట్లు పేర్కొన్నారు. ఆస్ట్రేలియాతో భారత్ ఆడుతున్న సమయంలో 15వ ఓవర్లో హర్షదీప్ రివర్స్ స్వింగ్ బౌలింగ్ చేశారని, అది ట్యాంపరింగ్ అని ఇంజమాముల్ ఆరోపించారు.
టీ20 వరల్డ్‌కప్ తొలిసారి యూఎస్ఏలో జరుగుతుంది. అక్కడి వాతావరణ పరిస్థితిలులు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నాము. అలాంటి పరిస్థితిలో బాలు సహజంగానే రివర్స్ స్వింగ్ అవుతుందని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. అక్కడి పిచ్‌లు కాస్త డిఫరెంట్‌గా ఉన్నాయని, వేడి ఎండలో మ్యాచ్ ఆడుతున్నామని, వికెట్ చాలా డ్రైగా ఉందని చెప్పారు. వీటి కారణంగానే బంతి ఆటోమెటిక్ రివర్స్ అవుతుందని, అది కేవలం భారత్ బౌలర్లకే కాదు అన్ని జట్లకు ఇలాగే అవుతోందని పేర్కొన్నారు.