South Africa for the final, England vs. India will not be exciting
ENGvsIND: సౌతాఫ్రికా జట్టు కీలక సమయంలో విజృంభించింది. సెమీస్ ఫైట్‌లో ఆఫ్ఘన్ జట్టును చిత్తుచేసింది. సగర్వంగా ఫైనల్ చేరింది. గతంలో జరిగిన అనేక ఐసీసీ టోర్నమెంట్లలో ఎన్నడూ ఫైనల్ చేరని సఫారీ జట్టు ఈ సారి ఆ ఆటంకాన్ని అధిగమించింది. ఇప్పటివరకు 8 సార్లు వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ ఆడిన ఆ జట్టు తొలిసారిగా ఫైనల్ చేరింది.
సెమీ-ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను చిత్తుచిత్తుగా ఓడించి గ్రాండ్‌గా తుది సమరానికి అర్హత సాధించింది. దీంతో చారిత్రాత్మకంగా తొలిసారి ఐసీసీ వరల్డ్ కప్‌లలో ఆ జట్టు ఫైనల్ చేరింది. సెమీ ఫైనల్లో ఆఫ్ఘనిస్థాన్‌పై సౌతాఫ్రికా 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. ఐసీసీ వరల్డ్ కప్‌ల చరిత్రలో తొలిసారి ఫైనల్ మ్యాచ్ ఆడబోతోంది. ఇప్పటివరకు 8 సార్లు వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ ఆడిన ఆ జట్టు తొలిసారిగా ఫైనల్ చేరింది.
తొలుత బ్యాటింగ్ చేసి ఆఫ్ఘనిస్థాన్ నిర్దేశించిన 57 పరుగుల లక్ష్యాన్ని కేవలం 8.5 ఓవర్లలోనే ఛేదించింది. ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 60 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డీకాక్ కేవలం 5 పరుగులకే వెనుతిరిగినప్పటికీ.. హెండ్రిక్స్ 29, కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ 23 మరో వికెట్ పడకుండా జట్టుని విజయ తీరాలకు చేర్చారు. గురువారం రాత్రి 8 గంటలకు రెండో సెమిఫైనల్ జరగబోతుంది. ఇండియా, ఇంగ్లాండ్‌ల నడుమ జరిగే ఈ పోరుతో ఫైనల్‌కు వెళ్లబోయే టీమ్ ఏదో తేలిపోతుంది.