Women's cricket.. India's victory over South Africa
Women cricket: దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఘనవిజయం సాధించింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో గెలిచి రికార్డు సృష్టించింది. సోమవారం రోజు రెండో ఇన్నింగ్స్‌ను 232/2 స్కోరుతో ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా 373 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దాంతో భారత్ కేవలం 37 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ టార్గెట్‌ను భారత్ సునాయసంగా చేదించింది. కేవలం 9.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది. భారత ప్లేయర్స్ షఫాలీ వర్మ 24 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. శుభా సతీష్ (13) పరుగులు చేశారు.
షెఫాలి వర్మ 197 బంతుల్లో 23 ఫోర్లు, 8 సిక్స్‌లతో మొత్తం 205 పరుగులు అందించింది. స్మృతి మంధాన 161 బంతుల్లో 149 పరుగులు చేసింది అందులో 27 ఫోర్లు, 1 సిక్స్ ఉంది. వీరందించిన భారీ స్కోర్‌తో తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 603/6 డిక్లేర్డ్ రికార్డు స్కోరు సాధించింది. అనంతరం దక్షిణాఫ్రికా 266 పరుగుల మాత్రమే చేసింది. తరువాత ఫాలోఆన్ ఆడింది. రెండో ఇన్నింగ్స్‌లో లారా వోల్వార్ట్ (122), సునే లూస్ (109) పరుగులు సాధించారు. నాడిన్ డిక్లెర్క్ (61)తో హాఫ్ సెంచరీ చేశారు. భారత్ మొదటి మ్యాచ్ నుంచి పట్టుబిగించింది. అందుకే 10 వికేట్లతో గెలిచింది.