ATP: రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తన స్వగృహంలో 30 మంది లబ్ధిదారులకు రూ.8.89 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర కాలంలో నియోజకవర్గంలో 210 మందికి రూ.1.67 కోట్ల ఆర్థిక సాయం అందించామని ఆయన తెలిపారు. ఖరీదైన వైద్యం చేయించుకోలేని పేదలకు సీఎంఆర్ఎఫ్ గొప్ప వరమని కొనియాడారు.