అన్నమయ్య: బి.కొత్తకోట జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారులు సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. మండలంలోని 10 ఉన్నత పాఠశాలల నుంచి 60 ప్రదర్శనలు విద్యార్థులు ప్రదర్శించారు. వీటిలో జిల్లా స్థాయి పోటీలకు 7 ఎగ్జిబిట్స్ ఎంపికయ్యాయి. జిల్లాకు ఎంపికైన విద్యార్థులకు ధృవపత్రాలు అందజేశారు. చిన్ననాటి నుంచే విజ్ఞాన శాస్త్రంపై అవగాహన పెంచుకొవాలన్నారు.