HYD బుక్ ఫెయిర్ మొదట 1985లో ప్రారంభమైంది. బుక్ ఫెయిర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రజల్లో పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడమే దీని ప్రధాన లక్ష్యం. మొదట అశోక్ నగర్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో నిర్వహించిన ఈ ఫెయిర్, తరువాత నిజాం కళాశాల, పబ్లిక్ గార్డెన్స్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లకు విస్తరించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతోంది. నేటి నుంచి DEC 29 వరకు జరగనుంది.