Former TTD MLA Pendyala Venkata Krishna Rao passed away
APPolitics: ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పెండ్యాల వెంకట కృష్ణారావు మృతి చెందారు. అందరూ ఆయన్ను కృష్ణబాబు అని పిలుస్తారు. వయోభారం, అనారోగ్యం కారణంగా మంగళవారం మృతిచెందారు. గత ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణబాబు హైదరాబాద్లో చికిత్స పొందారు. ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణాన్ని ఈ రోజు ఉదయం వైద్యులు వెల్లడించారు. టీడీపీ నుంచి ఐదు సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా ఆయనకు మంచి చరిత్ర ఉంది. కృష్ణారావు తన జీవితంలో చాలా భాగం ప్రజాజీవితంలోనే గడిపారు. ఆయన బాడీని తన స్వగ్రామం అయిన దొమ్మేరుకు తరలించారు. రేపు బుధవారం కుటుంబ సభ్యులు, అభిమానుల నడుమ ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.