»Wife Inflicts Cigarette Burns On Mans Private Parts He Exposes Her With Cctv
Woman torturing : భర్తను కట్టేసి సిగరెట్లతో వాతలు పెట్టిన భార్య.. అరెస్టు
భర్తను కట్టేసి సిగరెట్ తో వాతలు పెట్టిందో మహిళ. సీసీటీవీ పుటేజీలతో సహా భర్త కేసు పెట్టడంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చదివేయండి.
Woman torturing husband : మహిళలు గృహ హింసకు గురయ్యే ఘటనలను మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే ఓ భార్య తన భర్తను కట్టేసి చిత్ర హింసలకు గురి చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. యూపీకి చెందిన మెహర్ జాహన్ అనే మహిళ తన భర్తను కట్టేసి సిగరెట్‌తో(cigarette) ఒంటిపై వాతలు పెట్టింది.
ఆమె భర్త పేరు మహాన్ జైదీ. భర్తకు తొలుత మత్తు మందు ఇచ్చి అతడి కాళ్లు, చేతుల్ని కట్టేసింది. తర్వాత సిగరెట్(cigarette) వెలిగించి చేతులు, కాళ్ల, ఒంటిపై వాతలు పెట్టింది. తన గుండెలపై కూర్చుని శరీరాన్ని కాలుస్తున్న తన భార్యకు సంబంధించిన సీసీ టీవీ పుటేజీలను తీసుకెళ్లి భర్త పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. తన భార్య తనను రాచి రంపాన పెడుతోందని కాపాడలని కోరాడు.
తొలుత భార్య ఇలా చేసిందని చెప్పేసరికి పోలీసులు సైతం నమ్మలేదు. దీంతో భర్త తెలివిగా ఇంట్లో ఉన్న సీసీ టీవీ(CCTV) నుంచి ఫుటేజీలు సేకరించి చూపించాడు. దీంతో అవి చూసి పోలీసులు నిర్ఘాంతపోయారు. మే ఐదో తేదీన ఉత్తర ప్రదేశ్‌లోని సియోహరా జిల్లా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అటెంప్ట్ టు మర్డర్, టార్చర్, అసల్ట్ లాంటి నేరాలు మోపుతూ పలు ఐపీసీ సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేశారు.