Wall at CC Road: పక్కింట్లో, ఎదురింటి వారితో గొడవలు కామనే.. కానీ అక్కడ ఇద్దరికీ పడలేదు. ఏకంగా గోడ కట్టేశారు. వారి సొంత స్థలంలో కడితే ఇబ్బంది లేదు.. రోడ్డు మీద.. అదీ కూడా సీసీ రోడ్డు (cc road) మీద కట్టేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లో (andhra pradesh) గల పల్నాడులో (palnadu) జరిగింది.
శావల్యాపురం మండలం కారుమంచిలో కిలారు లక్ష్మీనారాయణ, కిలారు చంద్రశేఖర్ మధ్య గొడవ రాష్ట్రం దృష్టిని ఆకర్షించింది. వీరిద్దరి ఇళ్లు ఎదురెదురుగా ఉన్నాయి. మధ్యలో సీసీ రోడ్డు ఉంది. లక్ష్మీనారాయణ ఇంటి మెట్లను రోడ్డుపైకి వచ్చేలా కట్టాడు. దీంతో వివాదం మొదలైంది. దీనిపై చంద్రశేఖర్ అభ్యంతరం తెలిపాడు. గొడవ జరిగింది. గ్రామ పెద్దలు అటు నుంచి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఊరిలో రాజీ చేసుకోవాలని పోలీసులు సూచించగా.. పంచాయతీ సిబ్బంది కాంప్రమైజ్ చేశారు.
తర్వాత చంద్రశేఖర్ ఇంటి ముందు ఉన్న మురుగుకాల్వపై మెట్లు కట్టాడు. సమయం కోసం చూస్తన్న లక్ష్మీనారాయణ సీసీ రోడ్డు మధ్యలో మూడు అడుగుల ఎత్తులో గోడ కట్టాడు. అలా చిన్న గొడవ కాస్తా పెద్దదిగా మారింది. వాస్తవానికి అలా గోడ కట్టొద్దు.. పంచాయతీ సిబ్బంది ఊరుకోవద్దు.. అక్కడ ఏం జరిగిందో తెలియలేదు. అంతా స్తబ్ధుగా ఉండిపోయారు. అసలు గోడ కట్టే కార్మికులు కూడా ఎలా పనిచేశారో తెలియడం లేదు.