»Cyclone Alert Imd Predicts Heavy Rain In Andhra Pradesh In Next 4 5 Days
Rain Alert : ఏపీలో మూడు రోజులపాటు భారీ వర్షాలు
పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వాసులకు బిగ్ అలర్ట్. ఏపీలో భారీ వర్షాలు కురువనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రేపు తుపానుగా మారనుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Rain Alert : పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వాసులకు బిగ్ అలర్ట్. ఏపీలో భారీ వర్షాలు కురువనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రేపు తుపానుగా మారనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఈ నెల 4న కోస్తాంధ్ర తీరానికి చేరుకుని 5న నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతో ఆది, సోమ, మంగళవారాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రభుత్వం అవసరమైన మేరకు చర్యలను తీసుకుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రేపు బలపడి తుపానుగా మారనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. టోల్ ఫ్రీ నంబర్లను విడుదల చేయడంతో పాటు, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని ఏపీ ప్రభుత్వం సూచించింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో అధికారులు, ఉద్యోగుల సెలవులను కూడా రద్దు చేసింది.
తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై ఖచ్చితంగా ఉంటుందని.. చాలా చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే రైతులకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. కోతకు వచ్చే పంటను త్వరగా కోసి చక్కబెట్టుకోవాలని సూచించింది. మరోవైపు మత్స్యకారులకు కూడా.. ఈనెల రెండో తేదీ నుంచి హెచ్చరికలు మొదలవుతాయని చెబుతున్నారు. మరోవైపు ఉత్తర శ్రీలంక, పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ శ్రీలంక పై సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్ పై తూర్పు, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయి. దీంతో కొన్నిచోట్ల అడపాదడపా వానలు కురుస్తున్నాయని పేర్కొంది.