»Two Planes Veer Off Runway Crash At Same Airport In Tanzania On Same Day
Two Planes Crash: ఒకే రన్ వే పై విమానాలు.. ఆ తర్వాత ఏమైందంటే ?
టాంజానియా దేశంలో పెను ప్రమాదం తప్పింది. ఒకే విమానాశ్రయంలో ఒకే రోజు రెండు విమానాలు కూలిపోయాయి. అది కూడా గంటల్లోనే రన్వేవి తాకాయి. అదృష్టవశాత్తు ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Two Planes Crash: టాంజానియా దేశంలో పెను ప్రమాదం తప్పింది. ఒకే విమానాశ్రయంలో ఒకే రోజు రెండు విమానాలు కూలిపోయాయి. అది కూడా గంటల్లోనే రన్వేవి తాకాయి. అదృష్టవశాత్తు ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన మంగళవారం టాంజానియాలోని కికోబోగా విమానాశ్రయంలో జరిగింది. మొదట, యునైటెడ్ ఎయిర్ జాంజిబార్ విమానం 30 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బందితో జాంజిబార్ నుండి బయలుదేరింది. కికోబోగా ఎయిర్‌స్ట్రిప్‌లో ల్యాండ్ అవుతుండగా, విమానం రన్‌వేను తాకడంతో ల్యాండింగ్ గేర్ ఊడిపోయింది. దీంతో విమానం రన్‌వేపై కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో విమానం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
అయితే తెల్లవారుజామున ఈ ప్రమాదం నుంచి విమానాశ్రయ సిబ్బంది తేరుకోకముందే మరో ప్రమాదం చోటుచేసుకుంది. మొదటి ప్రమాదం జరిగిన ఆరు గంటల తర్వాత, కికోబోగా విమానాశ్రయం నుండి జాంజిబార్కు మరో విమానం సిద్ధంగా ఉంది. 30 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందితో జాంబియార్ వెళ్లేందుకు విమానం సిద్ధంగా ఉంది. రన్‌వేపై వేగం పుంజుకున్న తర్వాత టేకాఫ్‌కు బయలుదేరిన విమానం అదుపు తప్పి రన్‌వే చివర ఉన్న భవనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విమానం కూడా తీవ్రంగా దెబ్బతింది. ప్రమాదం తర్వాత ఘటనా స్థలంలో భారీగా పొగలు అలుముకున్నాయి. అయితే ఈ ప్రమాదంలో కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.