Man Sets Wine Shop On Fire Due To Denied Of Alcohol
Man Sets Wine Shop Fire: దీపావళి రోజున లక్ష్మీపూజ చేస్తుంటారు. అమ్మవారికి నోములు చేస్తుంటారు. మందుబాబులకు మందే సర్వస్వం. తెలుగు రాష్ట్రాల్లో నిన్న దీపావళి పండగ జరిగింది. వైన్ షాపులు (wine shop) తెరిచే ఉంటాయి. ఓ మందుబాబు సమయం అయిపోయిన తర్వాత షాపునకు వెళ్లాడు. మందు ఇవ్వాలని అడగగా.. క్లోజింగ్ టైమ్ అని చెప్పి, తాళం వేశారు.
ఇంకేముంది ఆ మందుబాబు మధుకు (madhu) మండింది. విశాఖ (vizag) మదురవాడలో (madurawada) గల ఆ వైన్ షాపు క్లోజ్ చేసిన తర్వాత పెట్రోల్ క్యాన్ తీసుకోని వెళ్లాడు. ఎవరూ లేరని నిర్ధారించుకొని పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. మంటలు ఎగిసిపడగా చుట్టుపక్కల వారు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే వచ్చి మంటలను ఆర్పివేశారు.
ఫర్నీచర్, కంప్యూటర్, ప్రింటర్ కాలిపోయాయి. రూ.1.5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని షాపు యజమాని చెబుతున్నారు. వైన్ షాపు ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడు మధును అరెస్ట్ చేశారు. అతనికి ఓ బాటిల్ ఇస్తే సరిపోయి ఉండేది.. లేదంటే ఈ స్థాయిలో ఆస్తి నష్టం జరిగి ఉండేది కాదని చుట్టు పక్కల వారు అంటున్నారు.