4 Days Infant మృతి.. ఘటనాస్థలికి కిషన్ రెడ్డి, కేసీఆర్ సంతాపం
బజార్ ఘాట్ ప్రమాదంలో ఓ నాలుగు రోజుల పసికందు చనిపోయింది. చిన్నారి చనిపోవడంతో బంధువులు, స్థానికులు రోదిస్తున్నారు. ప్రమాద స్థలిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస యాదవ్ పరిశీలించారు.
4 Days Infant Died: బజార్‌ఘాట్ ప్రమాదంలో ఓ చిన్నారి ఉందనే సంగతి తెలిసిందే. అయితే ఆ చిన్నారి పసికందు కావడం ప్రతీ ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. 4 రోజుల చిన్నారి (4 Days Infant) కావడంతో బంధువులు, చుట్టుపక్కల వారు రోదిస్తున్నారు. ప్రమాదంలో ఏడుగురు చనిపోగా.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అపస్మారక స్థితిలో ఉన్న వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రమాదంపై సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ప్రమాదం జరిగిన చోటును కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ప్రమాదాలు మరోసారి జరగకుండా చూడాలని కోరారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని మండిపడ్డారు. ప్రమాద ఘటనపై గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో ఉన్నవారికి మెరుగైన చికిత్స అందజేయాలని సీఎస్‌ను ఆదేశించారు. ఘటనకు గల కారణాలపై రెండురోజుల్లో నివేదిక అందజేయాలని కోరారు.
ప్రమాద స్థలిని మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస యాదవ్ పరిశీలించారు. అధికారులు, స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని వివరించారు. ప్రమాదం జరిగిన బిల్డింగ్ రమేశ్ జైశ్వల్ది కాగా.. అతను పరారీలో ఉన్నాడు. అతనిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.