KNR: ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతూ వృత్తి విద్యా కళాశాలలు సోమవారం బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని శ్రీ చైతన్య, వాగేశ్వరి, జ్యోతిష్మతి కళాశాలలు మూతపడ్డాయి. ఆదివారం విద్యార్థులకు సమాచారం ఇవ్వడంతో ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, డిప్లమా విద్యార్థులు కళాశాలలకు వెళ్లలేదు.