SRD: సిర్గాపూర్ మండలం కడ్పల్ PACS ఆధ్వర్యంలో యూరియా బస్తాలను పంపిణీ చేస్తున్నట్లు సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి సోమవారం తెలిపారు. ఇవాళ తమ సొసైటీకి 333 బస్తాల అలాట్మెంట్ వచ్చిందన్నారు. ఇప్పుడు ప్రతి రైతుకు ఒక బస్తా చొప్పున అందజేస్తున్నామన్నారు. మరిన్ని యూరియా బస్తాల అవసరానికి ఉన్నతాధికారులకు నివేదించినట్లు చెప్పారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దని తెలిపారు.