JGL: భీమారం మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన అంగడి ఆనంద్ కుమార్ విశ్వకర్మ జాతీయ పురస్కార్ అవార్డును అందుకున్నారు. శ్రీ విరాట్ విశ్వకర్మ విజ్ఞాన విశ్వ పరిషత్, తెలుగు ఇండియన్ కల్చరల్ బుక్ వరల్డ్ రికార్డు ఆధ్వర్యంలో హుస్నాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు.